దుత్తలూరు మండలంలో నిరుపేదల ఆవేదన: పింఛను అందక ఇబ్బందులు పడుతున్న బాధితులు

రిపోర్టర్: సునీల్ స్థలం: దుత్తలూరు

దుత్తలూరు మండలంలో పింఛను అందక నిరుపేద మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భర్తను కోల్పోయిన సౌభాగ్యతో పాటు, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన కొండమ్మ పింఛను కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు కనికరం చూపలేదని వాపోయారు. కూలి పనులు చేస్తూ, అప్పుల పాలై జీవనం సాగిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.