ఆస్తుల వివాదంలో కన్నతల్లిని పొట్టనబెట్టుకున్న కసాయి కొడుకులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కావలి

కావలి పట్టణంలో ఆస్తుల వివాదం కారణంగా కన్నతల్లినే కుమారులు దారుణంగా హత్య చేశారు. వృద్ధురాలి పోషణపై గొడవలతో ఆమెను చీకటి గదిలో బంధించి, అన్నపానీయాలు నిలిపివేసి ప్రాణాలు తీశారు. అనంతరం సహజ మరణంగా నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, మరో కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.