వరంగల్ మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించిన ఏఏఐ
రిపోర్టర్: సునీల్
స్థలం: వరంగల్
వరంగల్ నగర ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ముందడుగు వేసింది. జీఎస్టీ మినహా రూ. 213.59 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర నిర్మాణ పనులకు ఏఏఐ ఇంజినీరింగ్ విభాగం అధికారికంగా టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు కింద కొత్త డొమెస్టిక్ టెర్మినల్, ఏటీసీ టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్, ఫైర్ స్టేషన్ తదితర మౌలిక వసతులు నిర్మించనున్నారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ 18 నెలల కాలపరిమితిలో పనులు పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు.