దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
-ప్రాచ్య దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ లేదా వంట గ్యాస్ సిలిండర్ల కొరత వస్తుందనే వదంతులను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా ఖండించారు. దేశీయ ఉత్పత్తిని పెంచామని, ఎక్కడా ఎల్పీజీ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. వదంతుల కారణంగా ప్రజలు ఆందోళన చెంది పానిక్ బయ్యింగ్ చేయడంతోనే తాత్కాలిక నిబంధనలు తెచ్చామని పేర్కొన్నారు.