వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించిన అధికారులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హన్మకొండ
వరంగల్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసినట్లు వరంగల్ పోలీస్ వెల్లడించారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఈ ఆసుపత్రి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పర్యటనలో ఆసుపత్రి నిర్మాణ తీరుతెన్నులపై అధికారులు సమీక్షించారు.