అండర్-19 ఆసియా కప్ జట్టులో ద్రవిడ్, సెహ్వాగ్ కుమారులు చోటు
రిపోర్టర్: మహేష్
స్థలం: Muscat
భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు అన్వయ్ ద్రవిడ్, ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 ఆసియా కప్ జట్టులో స్థానం దక్కించుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఒమన్ వేదికగా నవంబర్ 5 నుండి 14 వరకు జరగనున్న ఈ టోర్నీ కోసం యువ ఆటగాళ్లు దేశవాళీ వినూ మన్కడ్ ట్రోఫీలో ప్రదర్శించిన అద్భుతమైన ప్రతిభ ఆధారంగా ఎంపికయ్యారు. భారత్ తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 6న నేపాల్‌తో తలపడనుంది.