తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వర్గం రద్దు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

జానీ మాస్టర్ భార్య సుమలతకు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ గట్టి షాకిచ్చింది. తెలుగు సినీ డ్యాన్సర్స్‌ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రఘు మాస్టర్‌కు మద్దతుగా సుమలత, రఘు మాస్టర్‌ సహా 225 మంది డ్యాన్సర్లతో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం అనంతరం ఈ మేరకు నిర్ణయం వెలువడింది.