భారత సైన్యంపై తప్పుడు ప్రచారం: సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఖండించిన ఆర్మీ

రిపోర్టర్: సురేష్ స్థలం: Guwahati

అరుణాచల్ ప్రదేశ్ లో చైనా దళాలు చొరబడ్డాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని భారత సైన్యం స్పష్టం చేసింది. పాకిస్థాన్ ప్రాయోజిత ఖాతాలు ఉద్దేశపూర్వకంగా భారత సైన్యానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆర్మీ ఫాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. సరిహద్దు అంశాలపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, అధికారిక వర్గాల ద్వారా మాత్రమే నిజాలు తెలుసుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.