'కుటుంబమే యూనిట్‌గా సంక్షేమ పథకాలు అమలు': సీఎం చంద్రబాబు

రిపోర్టర్: కృష్ణ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో తప్పుల కారణంగా సంక్షేమ పథకాలకు దూరమైన పేదలకు ఊరట లభించనుంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా జరిగిన మ్యాపింగ్‌లో అనేక లోపాలు తలెత్తడంతో అర్హులైన వేలాది మంది లబ్ధి పొందలేకపోయారు. ఈ నేపథ్యంలో హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ను రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. ఇకపై కుటుంబమే యూనిట్‌గా అన్ని సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయనున్నట్లు ప్రకటించడంతో అర్హులైన పేదలకు త్వరలోనే పూర్తిస్థాయిలో న్యాయం జరిగే అవకాశం ఉంది.