శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా హిందీ దివస్ వేడుకలు

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం అర్బన్ పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాల మామిళ్లగూడెం బ్రాంచ్లో హిందీ దివస్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వ్యాసరచన, వక్తృత్వం, పాత్రధారణ మరియు క్విజ్ పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ భాషా నైపుణ్యం, సృజనాత్మకతను ప్రదర్శించారు. హిందీ ఉపాధ్యాయురాలు జరీనాను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం చేతన్, ప్రిన్సిపాల్ నీరజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.