బీహార్‌లో వింత ఘటన: ఇంట్లో చోరీ భయంతో ఇంటిపైకి స్కార్పియో కారు!

రిపోర్టర్: మహేష్ స్థలం: బీహార్

బీహార్‌కు చెందిన మనోజ్ యాదవ్ తాను కొత్తగా కొనుగోలు చేసిన స్కార్పియో కారును దొంగల నుంచి కాపాడుకునేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఆయన, డ్రైవర్ మానేయడంతో కారు భద్రతపై ఆందోళన చెందాడు. దీంతో క్రేన్ సహాయంతో కారును ఏకంగా తన రెండస్తుల ఇంటి పైకప్పుపైకి ఎక్కించి పార్క్ చేశాడు. ప్రస్తుతం ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.