ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఒడిశా గోపాల్ పూర్, విశాఖపట్నం మధ్య శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్నం వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు, రేపు రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఉత్తరాంధ్రపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించారు.