ప్రైవేట్ నర్సరీల దందా: నకిలీ హైబ్రిడ్ మొక్కలతో రైతులను మోసం చేస్తున్న వైనం

రిపోర్టర్: సురేష్ స్థలం: Visakhapatnam

ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రైవేట్ నర్సరీల నిర్వాహకులు ఇష్టానుసారంగా ధరలు వసూలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన అనుమతులు లేకున్నా, రికార్డులు నిర్వహించకుండా విక్రయాలు సాగిస్తున్నారని వారు తెలిపారు. నాణ్యత లేని హైబ్రిడ్ మొక్కలను అంటగట్టి అమాయక రైతులను నిలువునా ముంచుతున్నారని, ప్రభుత్వ ఉద్యానక్షేత్రాలు నిర్లక్ష్యానికి గురికావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.