మొయినాబాద్లో విషాదం: విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

రిపోర్టర్: శివ స్థలం: రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. పెద్దమంగళారం సమీపంలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి మోక్షచరణ్, యశ్వంత్ అనే విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారని మొయినాబాద్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. పోలీసులకు భయపడి చీకట్లో పరుగులు తీస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని, మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.