చిన్నకొండూరులో 29 ఏళ్లుగా వైభవంగా సాగుతున్న వినాయక ఉత్సవాలు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో 1997 నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. యూనివర్సల్ యూత్, స్వతంత్ర వీర సావర్కర్ సేన ఆధ్వర్యంలో స్థానిక గ్రామ పెద్దలు, యువకుల సహకారంతో ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి దాదాపు 1,200 మంది భక్తులు హాజరై ప్రసాదాలు స్వీకరించారు. గ్రామాభివృద్ధి, సమైక్యత లక్ష్యంగా ఉత్సవాలను విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.