భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ హై రికార్డ్
రిపోర్టర్: మహేష్
స్థలం: India
భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు సరికొత్త రికార్డును సృష్టించాయి. సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా పెరిగి 785.706 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఒక్క వారంలోనే ఇవి 44.903 బిలియన్ డాలర్లు వృద్ధి చెందాయి. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంటూ దేశ ఆర్థిక వ్యవస్థ బలపడటానికి ఇది నిదర్శనంగా నిలిచింది.