వైద్య సేవలు మెరుగుపరచాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలు
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో వైద్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, పరీక్షా కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.