ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.29 కోట్ల నిధులు మంజూరు
రిపోర్టర్: సునీల్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ ప్రాజెక్ట్ కింద రూ.29 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన అభివృద్ధి పనులు, రోడ్ల అనుసంధానం అత్యద్భుతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నాగులపాడు రోడ్డు విస్తరణ పనులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.