స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్న చంద్రబాబు
రిపోర్టర్: సురేష్
స్థలం: బాపట్ల జిల్లా
బీసీలకు రాజకీయంగా, సామాజికంగా మరియు ఆర్థికంగా అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రేపే సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. వెనుకబడిన వర్గాలపై ద్వేషంతోనే ప్రతిపక్ష పార్టీ కోర్టుల్లో పిటిషన్లు వేసి రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటోందని చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు.