బ్రిటన్‌లో అజిత్ రేస్‌ను ప్రారంభించనున్న సీఎం విజయ్
రిపోర్టర్: రాజేష్
స్థలం: తమిళనాడు
బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్‌లో జరగనున్న లె మాన్స్ రేస్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గ్రీన్ ఫ్లాగ్ ఊపి ప్రారంభిస్తారు. ఇదే రేస్‌లో స్టార్ హీరో అజిత్ కుమార్ తన టీమ్‌తో కలిసి పోటీపడుతున్నారు. గత 34 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో సహచరులుగా ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే వేదికపైకి వస్తుండటంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ అరుదైన పరిణామం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.