అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వెల్లడి
రిపోర్టర్: గోపి
స్థలం: భారతదేశం
బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం అనంతరం పురుషుల సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. క్రికెట్ ప్రపంచంలో పదిహేను రోజులు చాలా పెద్ద సమయమని, సరైన సమయంలో అధికారికంగా వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుల ఎంపికతో పాటు కొత్త జూనియర్ సెలక్షన్ కమిటీ ఏర్పాటుపై కూడా చర్చించారు.