సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన పేదల పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కుప్పం
కుప్పం నియోజకవర్గంలో నూతన పెన్షన్ల కోసం అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకునే సమయంలో అనేక సాంకేతిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. హౌస్హోల్డింగ్ మ్యాపింగ్, రైస్ కార్డు మ్యాపింగ్ మరియు ఓటర్ ఐడీ సమస్యల కారణంగా అర్హత ఉన్నప్పటికీ పలువురు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని తెలిపారు. వరుస సెలవుల నేపథ్యంలో గడువులోపు దరఖాస్తు చేసుకోలేకపోతే పేదలు సంక్షేమానికి దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు.