బిగ్ బాస్ హౌస్‌లో బూతులు మాట్లాడినందుకు అజిఫ్‌కు మోహన్‌లాల్ గట్టి వార్నింగ్

రిపోర్టర్: అశోక్ స్థలం: కేరళ

బిగ్ బాస్ మలయాళం సీజన్ 8 లో కంటెస్టెంట్ ముహమ్మద్ అజిఫ్ బూతు భాష వాడటంపై హోస్ట్ మోహన్‌లాల్ తీవ్రంగా మందలించారు. వీకెండ్ ఎపిసోడ్‌లో కోపగించుకున్న మోహన్‌లాల్, ఇలాంటి ప్రవర్తనను షోలో ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. కొంబన్‌తో జరిగిన గొడవలో అజిఫ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కమ్యూనిటీని కించపరిచేలా మాట్లాడటం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేసిన మోహన్‌లాల్, ఫ్యామిలీస్ మరియు పిల్లలు షో చూస్తున్నారని హద్దుల్లో ఉండాలని స్పష్టం చేశారు.