శ్రీకాకుళం బీచ్లో విషాదం: అలల తాకిడికి నలుగురు గల్లంతు, ఇద్దరు మృతి

రిపోర్టర్: నరేష్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా పెద్దగనగళ్లవానిపేట బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు అలల తాకిడికి గల్లంతైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన పావని, మాధవి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పండగ సందర్భంగా విహారయాత్రకు వచ్చిన వారు సముద్రంలో మునుగుతున్న సమయంలో ఈ ఘోర విషాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.