ఢిల్లీలో కలకలం: పితంపురాలో వ్యాపారి ఇంటిపై దుండగుల కాల్పులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
ఢిల్లీలోని పితంపురా ప్రాంతంలో దుండగులు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. దుబాయ్ కేంద్రంగా వ్యాపారం నిర్వహించే సాహిల్ జైన్ నివాసం వెలుపల బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు గాల్లోకి పలు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారని వెల్లడించారు. ఈ ఘటనపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.