విశాఖలో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Visakhapatnam

విశాఖపట్నంలోని హరే కృష్ణ వైకుంఠంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పుష్పాలతో అభిషేకం చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం అంతా కృష్ణ నామస్మరణతో మార్మోగింది. భక్తుల కోలాహలం మధ్య వేడుకలు కన్నుల పండువగా సాగాయి.