కావలిలో బాధితులపైనే అక్రమ కేసులు: డీఎస్పీని నిలదీసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కావలి

కావలి మండలం కోళ్లదిన్నె గ్రామంలో తమవారిపై దాడి చేసిన నిందితులను వెనకేసుకు వస్తూ బాధితులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కావలి డీఎస్పీ వి.వి రమణ కుమార్ను కలిసి ఈ విషయమై విన్నవించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులపై కూడా దాడులు చేశారని ఆయన వివరించారు.