సర్వేపల్లిలో ఘనంగా వరి కోతలు ప్రారంభించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

రిపోర్టర్: sai స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కంటేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 700 ఎకరాల్లో వరి కోతలను ప్రారంభించారు. స్థానిక రైతులు గ్రామ దేవత తాళమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సోమిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ధాన్యం మద్దతు ధర రికార్డు స్థాయిలో రూ. 27,000 పలుకుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం డైరెక్టర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.