లీజు బకాయిల కోసం నిలదీసిన కొల్లేరు ప్రజలపై వైకాపా నేత కారుతో దాడి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఏలూరు

దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అనుచరులతో కలిసి లంక ప్రజలపై దౌర్జన్యానికి దిగారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. పెదవేగి మండలం వేగివాడలో చేపల చెరువుల లీజు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న కొల్లేరు ప్రజలు, కూటమి నాయకులపైకి కారు పోనివ్వడంతో పలువురు గాయపడ్డారు. తెదేపా నాయకులు భగవాన్, ఆదాములపై వైకాపా శ్రేణులు దాడి చేశాయని, క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.