ఈసీ కార్యాలయం ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు: జ్ఞానేష్ కుమార్ అరెస్టుకు డిమాండ్
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఖాతా వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి తీవ్ర నిరసన తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఆందోళన సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.