మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి వెల్లడి
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 322 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు.