తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి కలకలం: బంధించేందుకు ముమ్మర రెస్క్యూ ఆపరేషన్
రిపోర్టర్: కిరణ్
స్థలం: తూర్పు గోదావరి
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. దేచర్ల సమీపంలోని క్వారీ వద్ద తిష్ట వేసిన పులిని బంధించేందుకు సీసీఎఫ్ జ్యోతి, డీఎఫ్ఓ ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని వారు పేర్కొన్నారు. పూణె, ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందాలు డ్రోన్లు, రేడియో కాలర్ సిగ్నల్స్ సహాయంతో పులి జాడను కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.