మాదాపూర్ లో బరితెగింపు: అక్రమ నిర్మాణాలపై అధికారుల మౌనం వెనుక మర్మమేంటి

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

హైదరాబాద్ లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని, అధికారుల మౌనం అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఫిర్యాదులపై వారం రోజుల్ లో చర్యలు తీసుకోవాల్సి ఉన్నా, టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతల తర్వాత కూడా పనులు ఎలా కొనసాగుతున్నాయని ఏసీపీని ప్రశ్నించగా రికార్డులు పరిశీలిస్తామని బదులిచ్చారని స్థానికులు పేర్కొన్నారు.