పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు
రిపోర్టర్: అశోక్
స్థలం: పోలవరం, ఏలూరు జిల్లా
ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులను స్వయంగా తిలకించి, అధికారులను అడిగి పనుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేయడంపై ఆయన అధికారులతో సమీక్షించారు.