కన్నీరు తెప్పిస్తున్న రాపిడో డ్రైవర్ వ్యథ: కంటి క్యాన్సర్‌తో చిన్నారి పోరాటం
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
కంటి క్యాన్సర్‌తో పోరాడుతున్న తన చిన్నారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ రాపిడో డ్రైవర్ పడుతున్న యాతన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. ఒమన్‌లో ఉద్యోగం వదిలేసి వచ్చిన ఆ తండ్రి, పాప వైద్యం కోసం నానా తంటాలు పడుతున్నట్లు ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తొమ్మిది లక్షలు ఖర్చు చేశానని, మరో పదిహేను లక్షలు అవసరమని డ్రైవర్ వాపోయినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.