క్షుద్ర పూజలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ సంచలనం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Andhra Pradesh
మనుషులు చనిపోవాలని కొందరు క్షుద్ర పూజలు చేయిస్తున్నారని గ్రేట్ ఆంధ్ర న్యూస్ ద్వారా ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధాంతి వ్యాఖ్యలు చేసిన తర్వాతే తన మిత్రుడు ఆసుపత్రిపాలయ్యాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం ఉంటేనే ఏదైనా సాధించగలమని ఆయన స్పష్టం చేశారు. క్షుద్ర పూజల వ్యవహారంపై త్వరలోనే పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.