పెను విపత్తుగా ఎల్ నినో: అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
కరోనాను మించిన పెను విపత్తుగా ఎల్ నినో మారుతోందని, దీనిని అంత తేలికగా తీసుకుంటే తీవ్ర ప్రమాదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సచివాలయంలో మంత్రులతో ఎల్ నినోపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఈ వేసవిలో పంటలు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. రిజర్వాయర్లలో ప్రస్తుతం రెండు వందల తొంభై టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు.