చిన్నారుల కంటి చూపుపై హెచ్చరిక: టీవీకి దగ్గరగా కూర్చుంటే ప్రమాదమా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
పిల్లలు టీవీకి అత్యంత దగ్గరగా కూర్చోవడం సాధారణ విషయమే అయినప్పటికీ, అది సమీప దృష్టి లోపానికి సంకేతం కావచ్చని పీడియాట్రిక్స్ నిపుణులు డాక్టర్ వివేక్ జైన్ హెచ్చరించారు. అప్పుడప్పుడు అలా చేయడం వల్ల కంటి చూపు పోదని, కానీ నిత్యం ఇదే అలవాటుగా మారితే మాత్రం తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించి వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించాలని ఆయన స్పష్టం చేశారు.