ధమాల్ విత్ పతి పత్నీ ఔర్ పంగా షోలోకి షబీర్ అహ్లూవాలియా దంపతులు
రిపోర్టర్: సతీష్
స్థలం: ముంబై
బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన ధమాల్ విత్ పతి పత్నీ ఔర్ పంగా రియాలిటీ షో రెండో సీజన్ కొత్త ఉత్సాహంతో ప్రారంభం కానుందని నటుడు షబీర్ అహ్లూవాలియా తెలిపారు. ఈ షోలో తన భార్య కాంచీ కౌల్‌తో కలిసి పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. క్రీడలు, సాహసాలంటే తమకు మొదట్నుంచీ ఇష్టమని, ఈ షోలో పాల్గొనడం సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ బంధంలో స్నేహమే బలమని, ఈ వేదికపై సరికొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కాంచీ కౌల్ తెలిపారు.