అధికారుల తీరును ఎండగడుతూ కలెక్టర్ ఆకస్మిక తనిఖీల పర్వం
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
కమాన్పూర్ తహసీల్దార్ కార్యాలయం, జెడ్పీహెచ్ఎస్, జూలపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందాలని, భూ పునఃసర్వే పకడ్బందీగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన స్థాయిలను పరిశీలించి, సిలబస్ సకాలంలో పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల పోషకాహార వివరాలను ఆరా తీశారు.