ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ: రాష్ట్రంలో కొత్తగా ఏడు లక్షలకు పైగా ఓటర్ల నమోదు
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితా విడుదలైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏడు లక్షలకు పైగా ఓటర్లను ఎన్నికల సంఘం చేర్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా మూడు లక్షలకు పైగా పేర్లను తొలగించగా, ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు పైగా చేరిందని ఆయన స్పష్టం చేశారు.