స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమన్వయ కమిటీ ప్రత్యేక సమావేశం
రిపోర్టర్: రాము
స్థలం: నెల్లూరు
జనసేన సిద్ధాంతాలను, అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ శివశంకర్ రావు పిలుపునిచ్చారు. నెల్లూరులో జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, నాయకుల మధ్య సమన్వయం మరియు పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నేతలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.