మిలాన్ ఫ్యాషన్ వీక్లో అద్భుతమైన శైలితో కీర్తి సురేష్ అరంగేట్రం
రిపోర్టర్: శివ
స్థలం: Milan
ప్రముఖ నటి కీర్తి సురేష్ మిలాన్ ఫ్యాషన్ వీక్లో ఘనంగా అరంగేట్రం చేసినట్లు ఫ్యాషన్ నిపుణులు తెలిపారు. ఈ వేడుకలో ఆమె స్టైలిష్ గ్రే సూట్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా కనిపించినప్పటికీ తనదైన ఆధునిక మినిమలిజంతో అందరినీ ఆకట్టుకున్నట్లు వారు పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై ఆమె ప్రదర్శించిన ఈ విభిన్నమైన ఆహార్యం ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.