వరదయ్యపాళెం ఏకం ప్రాంగణంలో కల్కి భగవాన్ పార్థివదేహం సందర్శన
రిపోర్టర్: హరి
స్థలం: వరదయ్యపాళెం
చెన్నైలో కన్నుమూసిన కల్కి భగవాన్ పార్థివదేహాన్ని తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తులవల్లంలోని ఏకం ఆలయానికి బుధవారం తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. కుమారుడు కృష్ణాజీ, కోడలు ప్రీతాజీలతో పాటు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకున్నారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించగా శనివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.