'నాకు ఇదొక్కటే మార్గం మిగిలింది': ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆత్మహత్యాయత్నం

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

ప్రముఖ ఫోక్ ఆర్టిస్టులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈశ్వర్ సాయి భార్య శరణ్య తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బలవన్మరణానికి ముందు శరణ్య విడుదల చేసిన ఎమోషనల్ ఆడియో క్లిప్‌లో తాను మోసపోయానని, ఈశ్వర్ లేకపోతే బతకలేనంటూ కన్నీరుమున్నీరవడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.