విశాఖలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం: వృద్ధులకు బాసటగా నిలిచిన పోలీసులు
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అత్యంత పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా కొనసాగుతోందని VizagCityPolice వెల్లడించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వృద్ధులు మరియు దివ్యాంగులకు పోలీసులు మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించారని, వీల్చైర్లలో బూత్ల వరకు తీసుకెళ్లి ఓటు వేయించడంలో పూర్తిస్థాయిలో సహకరించామని పేర్కొన్నారు.