మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిందితుడు సౌరభ్ చంద్రకర్ అరెస్ట్

రిపోర్టర్: సునీల్ స్థలం: Raipur

మహాదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కు ప్రధాన ప్రమోటర్ అయిన సౌరభ్ చంద్రకర్ ను ఒమన్ నుండి భారత్ కు రప్పించినట్లు అధికారులు వెల్లడించారు. భిలాయ్ లో సాధారణ జ్యూస్ షాప్ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన, అక్రమ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించి దుబాయ్ లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ప్రస్తుతం సీబీఐ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులు ఎదుర్కొంటున్న నిందితుడిని రాయ్ పూర్ కోర్టులో హాజరుపరచనున్నారు.