తెలుగుదేశం పార్టీకి పుష్పానందం సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కిడారి శ్రావణ్ కుమార్ వెల్లడి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: అనంతగిరి

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కాసీపట్నంలో టీడీపీ సీనియర్ నాయకుడు పుష్పానందం భౌతికకాయానికి రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి డొన్ను దొర పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.