నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల సమరం: సింహపురి పీఠం కోసం నువ్వా నేనా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నెల్లూరు

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు తెదేపా, జనసేన, భాజపా కూటమి ముమ్మరంగా శ్రమిస్తోందని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఎం.భాస్కర్రెడ్డి తెలిపారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు, మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధ కూటమి విజయాకి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. మేయర్ అభ్యర్థిగా రూప్కుమార్ యాదవ్ బరిలో ఉండగా, వైకాపా తరఫున ఆనం విజయకుమార్రెడ్డి పోటీపడుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.