రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి ఏర్పాట్లు, మట్టి ప్రతిమల పంపిణీ
రిపోర్టర్: శివ
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల కంటే పర్యావరణ హితంగా మట్టి ప్రతిమలకు ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వివిధ జిల్లాల్లో మంత్రులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు, మొక్కలను పంపిణీ చేశారు. మంగినపూడి బీచ్‌లో 63 అడుగుల భారీ మట్టి గణపతిని మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు.